Wednesday, June 26, 2019

Ayya Nenu Chadivi Song lyrics - Repati Pourulu

అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా  నే సదివి బాగు పడతా 
పుస్తకాలు సదువుకోని  మన బతుకులు మారుస్త 
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా  నే సదివి బాగు పడతా

అమ్మమ్మ నీయమ్మ కొంప నాది తీస్తవేటి 

సదువు బూతం పడితే నువ్వు సంక నాకి పోతావు
బి ఏ , ఎం ఏ  చదివినోల్లె బికార్లయ్యి తిరుగుతుండ్రు  
సదువు గోల నీకొద్దురో 
కొడుకా సావు బతుకు మనకోద్దురో  
ఒరేయ్ ఒరేయ్ చదువు గోల నీకొద్దురో 
కొడుకా సావు బతుకు మనకోద్దురా

ఆ డాకటేరు కొడుకులాగా డాబు దూబు ఉంటాను

ప్లీడరు గాడి కొడుకు లాగ నెక్కు టై కడతాను  
ఎస్ ఐ గాడి  కొడుకు లాగ సైకీలెక్కి బడికేలత 
అయ్యా నే  సదివి బాగు పడతా
ఓరయ్యా  నే  సదివి బాగు పడతా

మతి బోయిన్దేటి నీకు మారాజుల బిడ్డలాళ్ళు 

ఆళ్ళతోటి పోలికేటి అడుక్కునే నా కొడుకా
పని పాట లేనోల్లకి సదువే ఓ పెద్ద పని 
సదువు గిదువు అన్నవంటే సెంప పగలగొడతాను 
సదువు  గోల మనకొద్దురా 
కొడుకా చావు బతుకు మనకోద్దురా.. ఒరేయ్  

దండించకు ఓరయ్య దండం బెడతా నీకు

వీదుల్లో బడులున్నయి, ఇస్కూలు బడులున్నయి 
పంతుల్లకు  కాళ్ళు మొక్కి సదువు బిక్ష పెట్టమంట 
అయ్యా  నే  సదివి బాగు పడతా
ఓరయ్యా  నే  సదివి బాగు పడతా 

ఈదుల్లో బడుల్లోన పందులు తొంగుటన్నాయి

అందులోన  పంతుళ్ళు తేక తురారాలాడి
ప్రివేటులు సదివితేనే పాసు జేత్తమంటాండ్రు     
సదువుకునే రోజులేల్లి  సదువులు కొనే రోజులోచ్చే
సదువు గోల మనకొద్దురా 
కొడుకా సావు బతుకు మనకోద్దురా 

డబ్బు గోల నీకెందుకు  ఆ బాదలు నే బడత

గవర్నమెంట్ సదువంట గరిబొల్ల సదువంట
అనాదొడి బిడ్డనని హాస్టల్లో జేరత 
పుత్తకాలు బట్టలు ఉత్తినే  ఇత్తరంట     
అయ్యా నే  సదివి బాగు పడతా
ఓరయ్యా  నే  సదివి బాగు పడతా 

నమ్మకురా ఆ మాట నంజికొడక సేడిపోతవ్ , అనాదోల్ల పుత్తకాలు అచ్చవలేదంటారు  

షాపు లోన పుత్తకాలు సాటు మాటు గమ్ముతుండ్రు 
పసి పిల్లలకాస్టల్లో  పాసి కూడు పెడుతుండ్రు
కొటాల నాయకులు వాటాలు పన్చుకునీ...
హాట్టళ్ళ సొమ్ము నంత ఓటర్లకు పంపుతుండ్రు  
చదువు గోల నీకొద్దురో  
కొడుకా సావు బతుకు మనకోద్దురో .. ఒరేయ్ 

కట్టమైన నట్టమైన కాన్వెంటుకు పంపించు , ఇంగిలీషు చదివి నేను ఇంజినీరునై ఓత్త

ఈ రిచ్చ బతుకు నీకెందుకు  కారు నీకు కొని దెత్త 
అయ్యా నే  చదివి బాగు పడతా
ఓరయ్యా  నే  చదివి బాగు పడతా 

నీ కానివెంటు సదువుకి కరుగుతాయి నా కండలు

ఇంజినీరు సదువుకి ఇంకుతాది నా నెత్తురు 
నువ్వు కారు గొనేలోపు నేను కాటి కెళ్ళి బోతాను
సదువు గోల నీకొద్దురో  
కొడుకా సావు బతుకు మనకోద్దురా

ఫై సదువులు సదుకొని పట్టాని పట్టుకొని 
మధ్యవర్తి మంతిరికి లంచాలు కట్టుకొని
ఆదోరకని పనులకు ఆపీసులు తిరిగి తిరిగి విసిగిపోయి చివరకి ఈ కప్పులు కడిగే కంటే
ముందు గానే ఈ పనులు ముచ్చటగా జెసుకోర
సదువు గోల మనకొద్దురో 
కొడుకా చావు బతుకు మనకోద్దురా 
సదువు గోల మనకొద్దురో  
కొడుకా సావు బతుకు మనకోద్దురా 

చిత్రం : రేపటి పౌరులం




 గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Kallallo Kala Varamai song lyrics - Dorasaani

కళ్లలో కల వరమై కల వరమై
గుండెల్లో పరవశమో వరమై 
కళ్లలో కల వరమై  కల వరము  వరమే అవ్వగా 
కళ్లలో కల వరమై కల వరమై
గుండెల్లో పరశమే  వశమై 
కళ్లలో కల వరమై కల వరమై కలిగే కోరికా 

ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా..  ఊహలే 

ఎన్నో కొంటె కథలే  చెప్పగా.. 
ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే 
ఆనందాల నిధికై చూడగా.... 
ఊరించే ఊసులు ఎన్నో 
ఉడికిస్తూ చంపుతుంటే  
ఆ తపనలోన  తనువు తుళ్లిపడుతుంటే..... 
పాల బుగ్గలోని  తళుకులే
వెన్నుపూసలోన వణుకులై 
కంటిపాపలోన కవితలా మారే 
చిన్ని మనసులోని పువ్విలా 
పసిడివన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే


ఏవో ఏవో ఏవో ఆశలే...  మెల్లగా 

యెదపై  తీపి మధువే చల్లగా.... 
ఏదో ఏదో  ఏదో మైకమే ముద్దుగా 
మైమరపించు మాయె చెయ్యగా 
ఆణువణువూ అలజడి రేగి 
తమకంలో తేల్చుకుంటే 
ఆ ఆదమరపులోన ఈడు సతమతమై 
పాల బుగ్గలోని  తళుకులే
వెన్నుపూసలోన వణుకులై 
కంటిపాపలోన కవితలా మారే
చిన్ని మనసులోని పువ్విలా 
పసిడివన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే 


చిత్రం     : దొరసాని 

రచన      : శ్రేష్ఠ 
గానం      : చిన్మయి 
సంగీతం : ప్రశాంత్ . ఆర్ .  విహారి 

 గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Sunday, June 9, 2019

Amma Amma song lyrics – Raghuvaran B.Tech

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా 
నువ్వే లేక వసి వాడనమ్మ  
మాటే లేకుండా నువ్వే మాయం 
కన్నీరవుతుంది యెదలో గాయం 
అయ్యో వెళ్లిపోయావే నన్నొదిలేసి ఎటు పోయావే 
అమ్మా  ఇకపై నే వినగలన నీ లాలి పాట
నే పాడే జోలకు నువ్ కన్నెత్తి చూసావో  అంతే చాలంట
అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా 
నువ్వే లేక వసి వాడనమ్మ  

చెరిగింది  దీపం కరిగింది రూపం 

అమ్మా నాపై ఏమంత కోపం 
కొండంత శోకం నేనున్నా లోకం 
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం 
నాకే ఎందుకు శాపం 
జన్మల గతమే చేసిన పాపం 
పగలే దిగులైన  నడిరేయి ముసిరింది 
కలవర పెడుతుంది పెను చీకటి 
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది 
బ్రతికి సుఖమేమిటి 

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా 

నువ్వే లేక వసి వాడనమ్మ 


వీడలేక నిన్ను విడిపోయి ఉన్నా 

కలిసే లేనా నీ శ్వాసలోన 
మరణాన్ని మరిచి జీవించి ఉన్న 
ఏ చోట ఉన్న నీ ద్యాసలోనా 
నిజమై నే లేకున్నా 
కన్నా నిన్నే కలగంటున్న
కాలం కలకాలం  ఒకలాగే నడిచేనా
కలతను రానికి కన్నంచున 
కసిరే శిశిరాన్ని  వెలివేసి  త్వరలోన
చిగురై నిన్ను చేరేనా 

 అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా 

నువ్వే లేక వసి వాడనమ్మ 
అడుగై నీతోనే నడిచొస్తున్న 
అద్దంలో నువ్వై కనిపిస్తున్న 
అయ్యో  వెళ్లిపోయావే 
నీలో ప్రాణం నా చిరునవ్వే 
అమ్మా ఇకపై నీ వినగలనా నీ లాలి పాట 
వెన్నంటే చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా 

చిత్రం : రఘువరన్ బి-టెక్ 

రచన:రామజోగయ్య శాస్త్రి 
సంగీతం :అనిరుద్ రవిచందర్ 
గానం :దీపు, యస్ .జానకి 




 గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Sunday, May 26, 2019

le le le le ivvale le le song lyrics - Gudumba Shankar

[లే లే లేలే  ఇవ్వాలే లేలే
లే లే లేలే  ఈ రోజల్లే లేలే
వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లె లేకుంటే బాకల్లె
ఉంటేనే పోతుంటాయి బాధలే]"2"

చిరుగాలై నువ్వుండాలి
నిన్నే కవ్విస్తుంటే
సుడిగాలి చుట్టేయాలి లేలే
గోడుగాల్లె పని చెయ్యాలి
నిన్నే కదిలిస్తుంటే
పడగల్లె పనిపట్టాలి లేలే
[నీరల్లె పారాలి
అందరి దాహం తీర్చాలి ]"2"
ఆణిచేస్తే ముoచేయ్యాలి లే
నేలల్లె ఉండాలి అందరి భారం మోయాలి
విసిగిస్తే భుకంపాలే చుపాలే

చెడు వుంది మంచి వుంది
అర్ధం వేరే వుంది
చెడ్దోల్లకు చెడు చెయ్యడమే మంచి
చేదుంది  తీపి ఉంది భేదం వేరే వుంది
చేదన్నది వున్నపుడేగా తీపి
ఎడముంది కుడి ఉంది
కుడి ఎడమయ్యే గొడవుంది
ఎటుకైన గమ్యం ఒకటే లే
బ్రతుకుంది చావుంది
చచ్చేదాకా బ్రతుకుంది
చచ్చాక బ్రతికేలగా బ్రతకాలే

చిత్రం     : గుడుంబా శంకర్
రచన     : చంద్రబోస్
సంగీతం : మణిశర్మ
గానం    : కేకే

గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Tuesday, May 21, 2019

Chalore Chalore Song lyrics - Jalsa

[ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్ చల్]"2"
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
యే సమరం ఎవ్వరికో తేల్చుకో ముందుగా
[ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్ చల్]"2"

చంపనిదే బతకవని బతికేందుకు చంపమని
నమ్మించే  అడవిని అడిగెం లాభం  బతికే దారేటని
ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్ చల్

సంహారం సహజమని సహవాసం స్వప్నమని
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శత్రువని
ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
యే సమరం ఎవ్వరికో తేల్చుకో ముందుగా
ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్ చల్

ధీరులకి దీనులకి అమ్మ ఒడి ఒక్కటే
వీరులకి చోరులకి కంట తడి ఒక్కటే
ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్ చల్
అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
యుగ యుగాలుగా  యే మృగాలకన్న ఎక్కువ ఏం ఎదిగాం
ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్ చల్

రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తు మరిచాం ఎపుడో సొంత ముఖం
ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్ చల్
తారలనే తెంచగలం  తలుచుకుంటే మనం
రవికిరణం చీల్చగలం రంగులనే మార్చగలం
[ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్  ఛలోరే ఛలోరే చల్ చల్]"2"

చిత్రం     : జల్సా
రచన     :చంద్రబోస్
సంగీతం :దేవి శ్రీ ప్రసాద్
గానం    :రంజిత్

గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Pedave Palikina Song lyrics – Naani

[పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ ]"2"
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ

కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ ]"2"
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ

యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ కరుణిoచే కోపం అమ్మ
వరమిచే తీపి శాపం అమ్మా
నా ఆలి అమ్మగా  అవుతుండగా
జోలాలి పాడనా కమ్మగ కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ

తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా

తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్లో ఒదిగే బాబు

ఇరువురికి నేను అమ్మవనా...
నా కొంగు పట్టే వాడు నా కడుపున పుట్టే వాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకన చల్లగ చల్లగా
ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దులకన్నా జో జో
బంగరు తండ్రీ జో జో బజ్జో లాలి జో

పలికే పదమే వినక కనులారా నిదురపో

కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దులకన్నా జో జో
బంగరు తండ్రీ జో జో బజ్జో లాలి జో
బజ్జో లాలి జో బజ్జో లాలి జో
బజ్జో లాలి జో............


చిత్రం     :నాని

రచన     :చంద్రబోస్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం    :ఉన్నికృష్ణన్ , సాధనా సర్గం


గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Monday, May 20, 2019

pachani chilukalu thodunte song lyrics - Bharatheeyudu

తందనానే తానానే ఆనందమే
తందనానే తానానే ఆనందమే
తందనానే తానానే ఆనందమే
తందనానే తానానే ఆనందమే
[పచ్చని చిలకలు తోడుంటే  పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక  చెల్లు ]"2"
చిన్న చిన్న గూటిలోనే  స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే 
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట

పచ్చని చిలకలు తోడుంటే  పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక  చెల్లు

అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం

అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం 
అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం 
బ్రతుకే నురేల్లందం బ్రతుకే బ్రంహానందం
చెలియా వయసుడిగే స్వగతంలో అనుభందం ఆనందమానందం 

పచ్చని చిలకలు తోడుంటే  పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక  చెల్లు

నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం 

మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం 
చలి గుప్పె మాసంలో చెలి ఒళ్ళే ఆనందం 
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే  కరుణే  ఆనందం 
అందం ఓ ఆనందం బందం పరమానందం 
చెలియా ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానందం 

పచ్చని చిలకలు తోడుంటే  పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక  చెల్లు
చిన్న చిన్న గూటిలోన  స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే 
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట

పచ్చని చిలకలు తోడుంటే  పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక  చెల్లు

చిత్రం     : భారతీయుడు

రచన     :భువన చంద్ర
సంగీతం :ఎ.ఆర్.రెహమాన్
గానం    :జేసుదాసు


గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Saturday, May 18, 2019

jeevithamante poratam song lyrics - Narasimha

[జీవితమంటే పోరాటం
పోరాటంలో ఉంది జయం ] "2"

[ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టే నువు పట్టు
గమ్యం చేరేట్టు]"2"

నువు పలుకే చేపట్టు 
కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు
తలబడు నరసింహా  

[పట్టు పురుగాల్లె ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి 
సాగర నరసింహా] "2"

[పిక్క బలముంది
యువకుల పక్క బలముంది 
అండగ దేవుడి తోడుంది
అడుగిడు నరసింహా]"2"

[జీవితమంటే పోరాటం
పోరాటంలో ఉంది జయం ]"2"

మరు ప్రాణి ప్రాణం తీసి
బ్రతికేది మృగమేరా... 
మరు ప్రాణి ప్రాణం తీసి 
నవ్వేది అసురుడురా...
[కీడే చేయని వాడే మనషి
మేలునే కోరు వాడే మహర్షి]"2"

నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు షివయ్య

[ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టే నువు పట్టు
గమ్యం చేరేట్టు]"2"

నువు పలుకే చేపట్టు 
కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు
తలబడు నరసింహా  

[పట్టు పురుగాల్లె ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి 
సాగర నరసింహా] "2"

పిక్క బలముంది
యువకుల పక్క బలముంది 
అండగ దేవుడి తోడుంది
అడుగిడు నరసింహా

[నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు షివయ్య]"2"

ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టే నువు పట్టు
గమ్యం చేరేట్టు


చిత్రం      :నరసింహా
రచన     :ఎ.యం.రత్నం ,శివ గణేష్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం    :శ్రీరామ్

గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Wednesday, May 15, 2019

Kadalalle Veche Song lyrics - Dear Comrade

కడలల్లె వేచే కనులే 
కదిలేను నదిలా కదిలే 

కడలల్లె వేచే కనులే 
కదిలేను నదిలా కలలే 
ఒడి చేరి ఒకటై పోయే... 
ఒడి చేరి ఒకటై పోయే 
తీరం కోరే ప్రాయం 

విరహం పొంగేలే ...
హృదయం ఊగేలే...
అధరం అంచులే..... 
మధురం కోరేలే.....

అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వే లేక వేదిస్తుందే వేసవిలా
చెంత చేరి సేదతీర
ప్రాయమిలా
చేయిచాచి కోరుతుంది
సాయమిలా

కాలాలు మారినా 
నీ ధ్యాస మారునా 
అడిగింది మొహమే
నీ తోడు ఇలా ఇలా 

విరహం పొంగేలే.. 
హృదయం ఊగేలే...
అధరం అంచులే..... 
మధురం కోరేలే....

కడలల్లె వేచే కనులే 
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచే కనులే 
కదిలేను నదిలా కదిలే 

నిన్నే నిన్నే కన్నులలో 
దాచానులే లోకముగా
నన్నే నన్నే మరిచానే
నీవుగా

బుగ్గ మీద ముద్దే పెట్టె
చిలిపితనం 
ఉన్నట్టుండి నన్నే చుట్టే
పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని
సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే
గుండెలోతుల్లో

నీలోన చేరగా 
నా నుంచి వేరుగా 
కదిలింది ప్రాణమే 
నీ వైపు ఇలా ఇలా....

చిత్రం     :డియర్ కామ్రేడ్
రచన     :క్రిష్ణ కాంత్
సంగీతం :జస్టిన్ ప్రభాకరన్
గానం    :సిద్ శ్రీరామ్

గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Idhe Kadha Nee Katha Song lyrics - Maharshi

ఇదే కథ ఇదే కథ నీ.. కథ 
ముగింపులేని దై సదా సాగద
ఇదే కథ ఇదే కథ నీ...  కథ 
ముగింపులేని దై సదా సాగద

నీ కంటి రెప్పలంచున 

మనస్సు నిండి పొంగిన 
ఓ నీటి బిందువే కదా 
నువ్వు వెతుకుతున్న సంపద 
ఒకొక్క జ్ఞాపకానికి 
వందేళ్ల ఆయువుందిగా 
ఇంకెన్ని ముందు వేచెనో 
అవన్నీ వెతుకుతూ...  పదా... 

మనుష్యులందు  నీ.. కథ 

మహర్షిలగా సాగద.. 
మనుష్యులందు నీ... కథ 
మహర్షిలగా సాగద... 

ఇదే కథ ఇదే కథ నీ..  కథ 

ముగింపులేని దై సదా సాగద
ఇదే కథ ఇదే కథ నీ...  కథ 
ముగింపులేని దై సదా సాగద

నిస్వార్ధం ఎంత గొప్పదో

ఈ పదము రుజువు కట్టదా
సిరాలు లక్ష ఓంపగా 
చిరాక్షరాలు రాయర 
నిశీది ఎంత చిన్నదో 
నీ కంటి చూపు చెప్పద 
నీ లోని వెలుగు పంచద 
విశాల నింగి చాలదా......

మనుష్యులందు  నీ.. కథ 

మహర్షిలగా సాగద.. 
మనుష్యులందు నీ... కథ 
మహర్షిలగా సాగద...


చిత్రం     :మహర్షి

రచన     :శ్రీమణి
సంగీతం :దేవి శ్రీ ప్రసాద్
గానం    :విజయ్ ప్రకాష్


గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...