Wednesday, May 15, 2019

Kadalalle Veche Song lyrics - Dear Comrade

కడలల్లె వేచే కనులే 
కదిలేను నదిలా కదిలే 

కడలల్లె వేచే కనులే 
కదిలేను నదిలా కలలే 
ఒడి చేరి ఒకటై పోయే... 
ఒడి చేరి ఒకటై పోయే 
తీరం కోరే ప్రాయం 

విరహం పొంగేలే ...
హృదయం ఊగేలే...
అధరం అంచులే..... 
మధురం కోరేలే.....

అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వే లేక వేదిస్తుందే వేసవిలా
చెంత చేరి సేదతీర
ప్రాయమిలా
చేయిచాచి కోరుతుంది
సాయమిలా

కాలాలు మారినా 
నీ ధ్యాస మారునా 
అడిగింది మొహమే
నీ తోడు ఇలా ఇలా 

విరహం పొంగేలే.. 
హృదయం ఊగేలే...
అధరం అంచులే..... 
మధురం కోరేలే....

కడలల్లె వేచే కనులే 
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచే కనులే 
కదిలేను నదిలా కదిలే 

నిన్నే నిన్నే కన్నులలో 
దాచానులే లోకముగా
నన్నే నన్నే మరిచానే
నీవుగా

బుగ్గ మీద ముద్దే పెట్టె
చిలిపితనం 
ఉన్నట్టుండి నన్నే చుట్టే
పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని
సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే
గుండెలోతుల్లో

నీలోన చేరగా 
నా నుంచి వేరుగా 
కదిలింది ప్రాణమే 
నీ వైపు ఇలా ఇలా....

చిత్రం     :డియర్ కామ్రేడ్
రచన     :క్రిష్ణ కాంత్
సంగీతం :జస్టిన్ ప్రభాకరన్
గానం    :సిద్ శ్రీరామ్

గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

No comments:

Post a Comment

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...