కానున్న కళ్యాణం ఏమన్నది
స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా గిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగాచిత్రం : సీత రామం
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : విశాల్ చంద్రశేకర్
గానం : అనురాగ్ కులకర్ణి ,సింధూరి విశాల్
No comments:
Post a Comment