Wednesday, June 26, 2019

Kallallo Kala Varamai song lyrics - Dorasaani

కళ్లలో కల వరమై కల వరమై
గుండెల్లో పరవశమో వరమై 
కళ్లలో కల వరమై  కల వరము  వరమే అవ్వగా 
కళ్లలో కల వరమై కల వరమై
గుండెల్లో పరశమే  వశమై 
కళ్లలో కల వరమై కల వరమై కలిగే కోరికా 

ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా..  ఊహలే 

ఎన్నో కొంటె కథలే  చెప్పగా.. 
ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే 
ఆనందాల నిధికై చూడగా.... 
ఊరించే ఊసులు ఎన్నో 
ఉడికిస్తూ చంపుతుంటే  
ఆ తపనలోన  తనువు తుళ్లిపడుతుంటే..... 
పాల బుగ్గలోని  తళుకులే
వెన్నుపూసలోన వణుకులై 
కంటిపాపలోన కవితలా మారే 
చిన్ని మనసులోని పువ్విలా 
పసిడివన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే


ఏవో ఏవో ఏవో ఆశలే...  మెల్లగా 

యెదపై  తీపి మధువే చల్లగా.... 
ఏదో ఏదో  ఏదో మైకమే ముద్దుగా 
మైమరపించు మాయె చెయ్యగా 
ఆణువణువూ అలజడి రేగి 
తమకంలో తేల్చుకుంటే 
ఆ ఆదమరపులోన ఈడు సతమతమై 
పాల బుగ్గలోని  తళుకులే
వెన్నుపూసలోన వణుకులై 
కంటిపాపలోన కవితలా మారే
చిన్ని మనసులోని పువ్విలా 
పసిడివన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే 


చిత్రం     : దొరసాని 

రచన      : శ్రేష్ఠ 
గానం      : చిన్మయి 
సంగీతం : ప్రశాంత్ . ఆర్ .  విహారి 

 గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

No comments:

Post a Comment

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...