Sunday, June 9, 2019

Amma Amma song lyrics – Raghuvaran B.Tech

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా 
నువ్వే లేక వసి వాడనమ్మ  
మాటే లేకుండా నువ్వే మాయం 
కన్నీరవుతుంది యెదలో గాయం 
అయ్యో వెళ్లిపోయావే నన్నొదిలేసి ఎటు పోయావే 
అమ్మా  ఇకపై నే వినగలన నీ లాలి పాట
నే పాడే జోలకు నువ్ కన్నెత్తి చూసావో  అంతే చాలంట
అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా 
నువ్వే లేక వసి వాడనమ్మ  

చెరిగింది  దీపం కరిగింది రూపం 

అమ్మా నాపై ఏమంత కోపం 
కొండంత శోకం నేనున్నా లోకం 
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం 
నాకే ఎందుకు శాపం 
జన్మల గతమే చేసిన పాపం 
పగలే దిగులైన  నడిరేయి ముసిరింది 
కలవర పెడుతుంది పెను చీకటి 
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది 
బ్రతికి సుఖమేమిటి 

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా 

నువ్వే లేక వసి వాడనమ్మ 


వీడలేక నిన్ను విడిపోయి ఉన్నా 

కలిసే లేనా నీ శ్వాసలోన 
మరణాన్ని మరిచి జీవించి ఉన్న 
ఏ చోట ఉన్న నీ ద్యాసలోనా 
నిజమై నే లేకున్నా 
కన్నా నిన్నే కలగంటున్న
కాలం కలకాలం  ఒకలాగే నడిచేనా
కలతను రానికి కన్నంచున 
కసిరే శిశిరాన్ని  వెలివేసి  త్వరలోన
చిగురై నిన్ను చేరేనా 

 అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా 

నువ్వే లేక వసి వాడనమ్మ 
అడుగై నీతోనే నడిచొస్తున్న 
అద్దంలో నువ్వై కనిపిస్తున్న 
అయ్యో  వెళ్లిపోయావే 
నీలో ప్రాణం నా చిరునవ్వే 
అమ్మా ఇకపై నీ వినగలనా నీ లాలి పాట 
వెన్నంటే చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా 

చిత్రం : రఘువరన్ బి-టెక్ 

రచన:రామజోగయ్య శాస్త్రి 
సంగీతం :అనిరుద్ రవిచందర్ 
గానం :దీపు, యస్ .జానకి 




 గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

No comments:

Post a Comment

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...