Wednesday, June 26, 2019

Ayya Nenu Chadivi Song lyrics - Repati Pourulu

అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా  నే సదివి బాగు పడతా 
పుస్తకాలు సదువుకోని  మన బతుకులు మారుస్త 
అయ్యా నే సదివి బాగు పడతా
ఓరయ్యా  నే సదివి బాగు పడతా

అమ్మమ్మ నీయమ్మ కొంప నాది తీస్తవేటి 

సదువు బూతం పడితే నువ్వు సంక నాకి పోతావు
బి ఏ , ఎం ఏ  చదివినోల్లె బికార్లయ్యి తిరుగుతుండ్రు  
సదువు గోల నీకొద్దురో 
కొడుకా సావు బతుకు మనకోద్దురో  
ఒరేయ్ ఒరేయ్ చదువు గోల నీకొద్దురో 
కొడుకా సావు బతుకు మనకోద్దురా

ఆ డాకటేరు కొడుకులాగా డాబు దూబు ఉంటాను

ప్లీడరు గాడి కొడుకు లాగ నెక్కు టై కడతాను  
ఎస్ ఐ గాడి  కొడుకు లాగ సైకీలెక్కి బడికేలత 
అయ్యా నే  సదివి బాగు పడతా
ఓరయ్యా  నే  సదివి బాగు పడతా

మతి బోయిన్దేటి నీకు మారాజుల బిడ్డలాళ్ళు 

ఆళ్ళతోటి పోలికేటి అడుక్కునే నా కొడుకా
పని పాట లేనోల్లకి సదువే ఓ పెద్ద పని 
సదువు గిదువు అన్నవంటే సెంప పగలగొడతాను 
సదువు  గోల మనకొద్దురా 
కొడుకా చావు బతుకు మనకోద్దురా.. ఒరేయ్  

దండించకు ఓరయ్య దండం బెడతా నీకు

వీదుల్లో బడులున్నయి, ఇస్కూలు బడులున్నయి 
పంతుల్లకు  కాళ్ళు మొక్కి సదువు బిక్ష పెట్టమంట 
అయ్యా  నే  సదివి బాగు పడతా
ఓరయ్యా  నే  సదివి బాగు పడతా 

ఈదుల్లో బడుల్లోన పందులు తొంగుటన్నాయి

అందులోన  పంతుళ్ళు తేక తురారాలాడి
ప్రివేటులు సదివితేనే పాసు జేత్తమంటాండ్రు     
సదువుకునే రోజులేల్లి  సదువులు కొనే రోజులోచ్చే
సదువు గోల మనకొద్దురా 
కొడుకా సావు బతుకు మనకోద్దురా 

డబ్బు గోల నీకెందుకు  ఆ బాదలు నే బడత

గవర్నమెంట్ సదువంట గరిబొల్ల సదువంట
అనాదొడి బిడ్డనని హాస్టల్లో జేరత 
పుత్తకాలు బట్టలు ఉత్తినే  ఇత్తరంట     
అయ్యా నే  సదివి బాగు పడతా
ఓరయ్యా  నే  సదివి బాగు పడతా 

నమ్మకురా ఆ మాట నంజికొడక సేడిపోతవ్ , అనాదోల్ల పుత్తకాలు అచ్చవలేదంటారు  

షాపు లోన పుత్తకాలు సాటు మాటు గమ్ముతుండ్రు 
పసి పిల్లలకాస్టల్లో  పాసి కూడు పెడుతుండ్రు
కొటాల నాయకులు వాటాలు పన్చుకునీ...
హాట్టళ్ళ సొమ్ము నంత ఓటర్లకు పంపుతుండ్రు  
చదువు గోల నీకొద్దురో  
కొడుకా సావు బతుకు మనకోద్దురో .. ఒరేయ్ 

కట్టమైన నట్టమైన కాన్వెంటుకు పంపించు , ఇంగిలీషు చదివి నేను ఇంజినీరునై ఓత్త

ఈ రిచ్చ బతుకు నీకెందుకు  కారు నీకు కొని దెత్త 
అయ్యా నే  చదివి బాగు పడతా
ఓరయ్యా  నే  చదివి బాగు పడతా 

నీ కానివెంటు సదువుకి కరుగుతాయి నా కండలు

ఇంజినీరు సదువుకి ఇంకుతాది నా నెత్తురు 
నువ్వు కారు గొనేలోపు నేను కాటి కెళ్ళి బోతాను
సదువు గోల నీకొద్దురో  
కొడుకా సావు బతుకు మనకోద్దురా

ఫై సదువులు సదుకొని పట్టాని పట్టుకొని 
మధ్యవర్తి మంతిరికి లంచాలు కట్టుకొని
ఆదోరకని పనులకు ఆపీసులు తిరిగి తిరిగి విసిగిపోయి చివరకి ఈ కప్పులు కడిగే కంటే
ముందు గానే ఈ పనులు ముచ్చటగా జెసుకోర
సదువు గోల మనకొద్దురో 
కొడుకా చావు బతుకు మనకోద్దురా 
సదువు గోల మనకొద్దురో  
కొడుకా సావు బతుకు మనకోద్దురా 

చిత్రం : రేపటి పౌరులం




 గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

No comments:

Post a Comment

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...