Tuesday, May 21, 2019

Pedave Palikina Song lyrics – Naani

[పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ ]"2"
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ

కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ ]"2"
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ

యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ కరుణిoచే కోపం అమ్మ
వరమిచే తీపి శాపం అమ్మా
నా ఆలి అమ్మగా  అవుతుండగా
జోలాలి పాడనా కమ్మగ కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ

తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా

తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్లో ఒదిగే బాబు

ఇరువురికి నేను అమ్మవనా...
నా కొంగు పట్టే వాడు నా కడుపున పుట్టే వాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకన చల్లగ చల్లగా
ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దులకన్నా జో జో
బంగరు తండ్రీ జో జో బజ్జో లాలి జో

పలికే పదమే వినక కనులారా నిదురపో

కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దులకన్నా జో జో
బంగరు తండ్రీ జో జో బజ్జో లాలి జో
బజ్జో లాలి జో బజ్జో లాలి జో
బజ్జో లాలి జో............


చిత్రం     :నాని

రచన     :చంద్రబోస్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం    :ఉన్నికృష్ణన్ , సాధనా సర్గం


గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

No comments:

Post a Comment

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...