కానున్న కళ్యాణం ఏమన్నది
స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా గిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగాTelugu song lyrics
Sunday, October 9, 2022
Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam
Sunday, March 27, 2022
Mattilo Thema Undhi Song Lyrics In Telugu -Jai bhim
మట్టిలో తేమ ఉందీ
రేయికో ఎన్నెలుందీ
నమ్మితే రేపు నీదీ
జీవితం సాగనుందీ
వెళ్ళే దారుల్లో… ఆకాశం తోడుందీ
హద్దే నీకొద్దూ… నీ నవ్వే వీడొద్దూ
మట్టిలో తేమ ఉందీ, ఈ ఈఈ
రేయికో వెన్నెలుందీ, ఈ ఈఈ
పట్టుదల నీ పడవై
దాటు పదా సాగరం
నేలతల్లి నేర్పెకదా
గుండెల్లోని ఓ నిబ్బరం
నిక్కమున్న బాటలోన
నీ పయనం నీకు జయం
ఊపిరున్న కాలమంత
ప్రేమేగా నీకు వరం
ఆశే లేనట్టీ… బ్రతుకుందా చెప్పమ్మా
నీ గుండెల్లోనే… బదులుందే చిన్నమ్మ
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ
చిత్రం : జై భీమ్
సాహిత్యం : శరత్ సంతోష్
సంగీతం : సీన్ రోల్డాన్
గానం : లలితా సుధ
Thursday, June 10, 2021
Challa Gaali Thaakuthunna Song Lyrics - Yevade Subramanyam(2015)
చల్ల గాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
ఎందుకంట ఇంత దగా
నిన్న మొన్నా .. లేదు కదా
ఉండి ఉండి నెమ్మదిగా
నన్ను ఏటో లాగుతుందా
తప్పదని తప్పించుకోలేనని
తోచెట్టు చేస్తున్నదా
చల్ల గాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
ఎవరో అన్నారని .. మారావే .. నాలో ఆశలూ
ఎవరేమన్నారనీ .. పొంగేనే .. ఏవో ఊహలూ
ఎవరో అన్నారని .. మారావే .. నాలో ఆశలూ
ఎవరేమన్నారనీ .. పొంగేనే .. ఏవో ఊహలూ
తీరం తెలిసాకా ఇంకో దారిని మార్చనా
దారులు సరి అయినా .. వేరే తీరం చేరేనా
నడకలు నావేనా .. నడిచేది .. నేనేనా
చల్ల గాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
ఎంతగా వద్దంటున్నా .. ఆగదు ఆత్రం ఏమిటో
ఇంతగా పొంగెతా .. అవసరం .. ఏమో .. ఎందుకో
అయినా ఏమయినా ఎద నా చేయిజారిందే
ఎపుడో ఏనాడో ప్రేమే నేరం కాదంది
చెలిమె .. ఇంకోలా .. చిగురిస్తూ .. ఉందటే
చల్ల గాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
చిత్రం : ఎవడే సుబ్రహ్మణ్యం
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : ఇళయరాజా
గానం : రక్షిత సురేష్ & సెంథిల్
Sunday, June 6, 2021
Radha Ramanam Song Lyrics – Thipparaa Meesam(2019)
రాధా రమనం మొదలాయె పయనం
కాదా మధురం జతచేరె తరుణం
రాధా రమనం అది ప్రేమ ప్రణయం
కాదా మధురం … మరి చూసే తరుణం
అడుగే పరుగై బదులే మరిచే
కథలో మలుపు మొదలే
తిరిగే సమయం సెలవే అడిగే
తనతో తననే విడిచే
నాతో నడిచే సగం ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం … ఎదురే నిలిచే నీలా
మొహమాటం తుడిచేసి … నీతో పయనించా
చిరుకోపం వదిలేసి ఏదో గమనించా
గతమే వదిలి నీతో కదిలే … ప్రతి క్షణము ఆనందమే
ఇకపై దొరికే గురుతై నిలిచే … ప్రతి విషయం నా సొంతమే
నాతో నడిచే సగం ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం … ఎదురే నిలిచే నీలా
చిగురంతా చనువేదో వింతే అనిపించే
కలకాదే నిజమంటూ మాటే వినిపించే
మాటే మరిచి ఎదలో మౌనం విన్నావా ఇన్నాళ్ళకి
శూన్యం చెరిపి వెలుగే నిలిపి … ఉంటావా ఈనాటికీ
నాతో నడిచే సగం ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం … ఎదురే నిలిచే నీలా
చిత్రం : తిప్పరా మీసం
సాహిత్యం : పూర్ణ చారీ
సంగీతం : సురేష్ బొబ్బిలి
గానం : అనురాగ్ కులకర్ణి & నూతన మోహన్
Thursday, January 14, 2021
Nanu Preminchananu Song Lyrics Jodi (1999)
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
రేయిని మలిచి...ఓ...రేయిని మలిచి, కనుపాపలుగా చేసావో...
కనుపాపలుగా చేసావో,చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో...
మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్లుగ మలచి,
మెరుపు తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవిగాలులు పీల్చి వికసించే పువ్వుని తెచ్చి.
మంచి గంధాలెన్నో పూసి మేనిని మలిచావో...
అయినా...మగువ, మనసుని శిలగా చేసినావే
వలచే... మగువ, మనసుని శిలగా చేసినావే...
నను ప్రేమించానను మాట, కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
వయసుని తడిమి నిదురలేపింది నీవేగా.. నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపిందినీవేగా..
ఓ..గాలి నేల నింగి ప్రేమ, ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరు..ఓ ప్రేమ నీవేగా
గంగై పొంగె మనసు కవితల్లె పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా-కమ్ముకున్నది నీవేగా..
అయినా...చెలియ...మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే.. లేక మనసుని మాత్రం వీడిపోయావే....
నను ప్రేమించానను మాట, కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
చిత్రం : జోడి
సాహిత్యం : వేటూరి
సంగీతం : A R రెహమాన్
గానం : హరిహరన్
Preminche premava song lyrics – Nuvu nenu Prema (2006)
ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే
ప్రేమించేన ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
పూవైనా పుస్తున్నా ని పరువంగానే పుడతా
మధు మాసపు మాలల మంటలు రగిలించే ఉసురై
నీవే నా మదిలో అడ నేనే నే నటనై రాగా
నా నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం ఉందే హో
తోడు దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మీనం
ప్రేమించేన ప్రేమవా ఊరించే ఊహవా
నే నేనా అడిగా నన్ను నేనే
నే నేనా అడిగా నన్ను నేనే
ప్రేమించేన ప్రేమవా ఊరించే ఊహవా
నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా
తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా
నీవే సంద్రము చేరే గల గల పారే నది తెలుసా
ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే
ప్రేమించే
ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించేన ప్రేమవా పూవల్లె పూవల్లే
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
చిత్రం : నువ్వు నేను ప్రేమ
సాహిత్యం : వేటూరి
గానం : శ్రేయ ఘోషల్ ,నరేష్ అయ్యర్
సంగీతం : A.R.రెహమాన్
Tuesday, October 20, 2020
Life Of Ram Telugu Song Lyrics – Jaanu Movie
ఏ దారెదురైన ఎటువెళుతుందో అడిగానా
ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న
ఎం చూస్తూ ఉన్న నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న
కదలని ఓ శిలనే అయినా
తృటిలో కరిగే కలనే అయినా
ఎం తేడా ఉందట నువేవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నయి ఉంటానంటున్న
ఏదో ఒక బదులై నను చేరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్న
నా వెంటపడి నువ్వింత ఒంటరి అనవద్దు
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
తన వెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన
గుస గుస కబురుల
గుమ గుమ లెవరివి
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనగా
అనగనగ అంటూనే ఉంటా
ఎపుడు పూర్తవనే అవకా
తుదిలేని కథ నేనుగా
గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏ చోట నిలకడగా
ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక మౌనంగా
నా వెంటపడి నువ్వింత ఒంటరివనవద్దు
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
తన వెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన
గుస గుస కబురుల
గుమ గుమ లెవరివి
లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్న విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ వొడిలో మొన్న
అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిల్లీ అంత దూరానున్న
వెన్నలాగా చెంతనే ఉన్న
అంటూ ఊయలలూపింది జోలాలి
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ప్రదీప్ కుమార్
సంగీతం : గోవింద్ వసంత
Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam
కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...
-
కళ్లలో కల వరమై కల వరమై గుండెల్లో పరవశమో వరమై కళ్లలో కల వరమై కల వరము వరమే అవ్వగా కళ్లలో కల వరమై కల వరమై గుండెల్లో పరశమే వశమై కళ్ల...
-
చల్ల గాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా ఎందుకంట ఇంత దగా నిన్న మొన్నా .. లేదు కదా ఉండి ఉండి ...
-
తందనానే తానానే ఆనందమే తందనానే తానానే ఆనందమే తందనానే తానానే ఆనందమే తందనానే తానానే ఆనందమే [పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూ...