నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
రేయిని మలిచి...ఓ...రేయిని మలిచి, కనుపాపలుగా చేసావో...
కనుపాపలుగా చేసావో,చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో...
మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్లుగ మలచి,
మెరుపు తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవిగాలులు పీల్చి వికసించే పువ్వుని తెచ్చి.
మంచి గంధాలెన్నో పూసి మేనిని మలిచావో...
అయినా...మగువ, మనసుని శిలగా చేసినావే
వలచే... మగువ, మనసుని శిలగా చేసినావే...
నను ప్రేమించానను మాట, కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
వయసుని తడిమి నిదురలేపింది నీవేగా.. నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపిందినీవేగా..
ఓ..గాలి నేల నింగి ప్రేమ, ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరు..ఓ ప్రేమ నీవేగా
గంగై పొంగె మనసు కవితల్లె పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా-కమ్ముకున్నది నీవేగా..
అయినా...చెలియ...మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే.. లేక మనసుని మాత్రం వీడిపోయావే....
నను ప్రేమించానను మాట, కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
చిత్రం : జోడి
సాహిత్యం : వేటూరి
సంగీతం : A R రెహమాన్
గానం : హరిహరన్
No comments:
Post a Comment