రాధా రమనం మొదలాయె పయనం
కాదా మధురం జతచేరె తరుణం
రాధా రమనం అది ప్రేమ ప్రణయం
కాదా మధురం … మరి చూసే తరుణం
అడుగే పరుగై బదులే మరిచే
కథలో మలుపు మొదలే
తిరిగే సమయం సెలవే అడిగే
తనతో తననే విడిచే
నాతో నడిచే సగం ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం … ఎదురే నిలిచే నీలా
మొహమాటం తుడిచేసి … నీతో పయనించా
చిరుకోపం వదిలేసి ఏదో గమనించా
గతమే వదిలి నీతో కదిలే … ప్రతి క్షణము ఆనందమే
ఇకపై దొరికే గురుతై నిలిచే … ప్రతి విషయం నా సొంతమే
నాతో నడిచే సగం ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం … ఎదురే నిలిచే నీలా
చిగురంతా చనువేదో వింతే అనిపించే
కలకాదే నిజమంటూ మాటే వినిపించే
మాటే మరిచి ఎదలో మౌనం విన్నావా ఇన్నాళ్ళకి
శూన్యం చెరిపి వెలుగే నిలిపి … ఉంటావా ఈనాటికీ
నాతో నడిచే సగం ప్రేమే కాదా
నా కనులే వెతికే నిజం … ఎదురే నిలిచే నీలా
చిత్రం : తిప్పరా మీసం
సాహిత్యం : పూర్ణ చారీ
సంగీతం : సురేష్ బొబ్బిలి
గానం : అనురాగ్ కులకర్ణి & నూతన మోహన్
No comments:
Post a Comment