Tuesday, October 20, 2020

Life Of Ram Telugu Song Lyrics – Jaanu Movie

 ఏ దారెదురైన  ఎటువెళుతుందో  అడిగానా 

ఎం తోచని  పరుగై  ప్రవహిస్తూ  పోతున్న 

ఎం  చూస్తూ  ఉన్న  నే  వెతికానా  ఏదైనా 

ఊరికినే  చుట్టూ  ఏవేవో  కనిపిస్తూ  ఉన్న 

కదలని  ఓ  శిలనే  అయినా

తృటిలో  కరిగే  కలనే  అయినా 

ఎం  తేడా  ఉందట నువేవరంటూ  అడిగితే  నన్నెవరైనా

ఇల్లాగే  కడదాకా ఓ  ప్రశ్నయి  ఉంటానంటున్న 

ఏదో  ఒక  బదులై నను  చేరపొద్దని  కాలాన్నడుగుతూ   ఉన్న 


నా  వెంటపడి  నువ్వింత   ఒంటరి అనవద్దు  

అనొద్దు  దయుంచి  ఎవరు 

ఇంకొన్ని  జన్మాలకి  సరిపడు 

అనేక  స్మృతుల్ని  ఇతరులు  ఎరుగరు 

నా  ఊపిరిని  ఇన్నాళ్ళుగా 

తన  వెన్నంటి  నడిపిన 

చేయూత  ఎవరిది 

నా  ఎద   లయను  కుశలము అడిగిన 

గుస  గుస  కబురుల

గుమ  గుమ  లెవరివి 


ఉదయం  కాగానే  తాజాగా  పుడుతూ  ఉంటా 

కాలం  ఇపుడే  నను  కనగా  

అనగనగ  అంటూనే  ఉంటా 

ఎపుడు  పూర్తవనే  అవకా 

తుదిలేని  కథ  నేనుగా 


గాలి  వాటం  లాగా  ఆగే  అలవాటే  లేక 

కాలు  నిలవదు  ఏ  చోట   నిలకడగా 

ఏ  చిరునామా  లేక  ఏ  బదులు  పొందని  లేఖ 

ఎందుకు  వేస్తుందో  కేక  మౌనంగా 


నా  వెంటపడి  నువ్వింత    ఒంటరివనవద్దు 

అనొద్దు  దయుంచి  ఎవరు 

ఇంకొన్ని  జన్మాలకి  సరిపడు 

అనేక  స్మృతుల్ని  ఇతరులు  ఎరగరు 


నా  ఊపిరిని  ఇన్నాళ్ళుగా 

తన  వెన్నంటి  నడిపిన 

చేయూత  ఎవరిది 

నా  ఎద లయను  కుశలము  అడిగిన 

గుస  గుస  కబురుల 

గుమ  గుమ  లెవరివి 


లోలో  ఏకాంతం  నా  చుట్టూ  అల్లిన  లోకం 

నాకే  సొంతం  అంటున్న  విన్నారా 

నేను  నా  నీడ  ఇద్దరమే  చాలంటున్న 

రాకూడదు  ఇంకెవరైనా

 

అమ్మ  వొడిలో  మొన్న 

అందని  ఆశలతో  నిన్న 

ఎంతో  ఊరిస్తూ  ఉంది 

జాబిల్లీ  అంత దూరానున్న 

వెన్నలాగా  చెంతనే ఉన్న 

అంటూ  ఊయలలూపింది    జోలాలి 



సాహిత్యం : సిరివెన్నెల  సీతారామ  శాస్త్రి  

గానం        : ప్రదీప్ కుమార్ 

సంగీతం   : గోవింద్ వసంత 


No comments:

Post a Comment

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...