Thursday, June 10, 2021

Challa Gaali Thaakuthunna Song Lyrics - Yevade Subramanyam(2015)

 చల్ల  గాలి  తాకుతున్న 

మేఘమైనదీ  మనసిలా 

నేలకేసి  జారుతున్న 

జల్లు  అయినదీ వయసిలా 

ఎందుకంట  ఇంత దగా 

నిన్న  మొన్నా .. లేదు  కదా 

ఉండి ఉండి నెమ్మదిగా 

నన్ను  ఏటో  లాగుతుందా 

తప్పదని  తప్పించుకోలేనని 

తోచెట్టు  చేస్తున్నదా


చల్ల  గాలి  తాకుతున్న 

మేఘమైనదీ  మనసిలా 

నేలకేసి  జారుతున్న 

జల్లు  అయినదీ వయసిలా


ఎవరో  అన్నారని .. మారావే .. నాలో  ఆశలూ 

ఎవరేమన్నారనీ .. పొంగేనే .. ఏవో  ఊహలూ 

ఎవరో  అన్నారని .. మారావే .. నాలో  ఆశలూ 

ఎవరేమన్నారనీ .. పొంగేనే .. ఏవో  ఊహలూ 

తీరం  తెలిసాకా  ఇంకో   దారిని  మార్చనా  

దారులు  సరి  అయినా .. వేరే  తీరం  చేరేనా 

నడకలు  నావేనా .. నడిచేది .. నేనేనా 


చల్ల  గాలి  తాకుతున్న 

మేఘమైనదీ  మనసిలా 

నేలకేసి  జారుతున్న 

జల్లు  అయినదీ వయసిలా


ఎంతగా  వద్దంటున్నా .. ఆగదు  ఆత్రం  ఏమిటో 

ఇంతగా  పొంగెతా .. అవసరం .. ఏమో .. ఎందుకో 

అయినా  ఏమయినా  ఎద  నా  చేయిజారిందే 

ఎపుడో  ఏనాడో  ప్రేమే  నేరం  కాదంది

చెలిమె .. ఇంకోలా .. చిగురిస్తూ .. ఉందటే 


చల్ల  గాలి  తాకుతున్న 

మేఘమైనదీ  మనసిలా 

నేలకేసి  జారుతున్న 

జల్లు  అయినదీ వయసిలా


చిత్రం        : ఎవడే సుబ్రహ్మణ్యం   

సాహిత్యం  :  అనంత శ్రీరామ్  

సంగీతం    : ఇళయరాజా   

గానం         :  రక్షిత సురేష్ & సెంథిల్  

Sunday, June 6, 2021

Radha Ramanam Song Lyrics – Thipparaa Meesam(2019)

 రాధా  రమనం  మొదలాయె  పయనం 

కాదా  మధురం  జతచేరె తరుణం 

రాధా  రమనం అది  ప్రేమ  ప్రణయం 

కాదా  మధురం … మరి  చూసే  తరుణం 


అడుగే  పరుగై  బదులే  మరిచే

కథలో  మలుపు  మొదలే 

తిరిగే  సమయం  సెలవే  అడిగే 

తనతో  తననే  విడిచే 


నాతో  నడిచే  సగం  ప్రేమే  కాదా 

నా  కనులే  వెతికే  నిజం … ఎదురే  నిలిచే  నీలా 


మొహమాటం  తుడిచేసి … నీతో  పయనించా 

చిరుకోపం  వదిలేసి  ఏదో  గమనించా 

గతమే  వదిలి  నీతో  కదిలే … ప్రతి  క్షణము  ఆనందమే 

ఇకపై  దొరికే  గురుతై  నిలిచే … ప్రతి  విషయం  నా  సొంతమే 


నాతో  నడిచే  సగం  ప్రేమే  కాదా 

నా  కనులే  వెతికే  నిజం … ఎదురే   నిలిచే  నీలా 


చిగురంతా  చనువేదో  వింతే  అనిపించే 

కలకాదే  నిజమంటూ  మాటే  వినిపించే 

మాటే  మరిచి  ఎదలో  మౌనం  విన్నావా  ఇన్నాళ్ళకి 

శూన్యం  చెరిపి  వెలుగే  నిలిపి … ఉంటావా  ఈనాటికీ 

నాతో  నడిచే  సగం  ప్రేమే  కాదా 

నా  కనులే  వెతికే  నిజం … ఎదురే  నిలిచే  నీలా 



చిత్రం        : తిప్పరా మీసం  

సాహిత్యం  :  పూర్ణ  చారీ 

సంగీతం    :  సురేష్  బొబ్బిలి 

గానం         :  అనురాగ్  కులకర్ణి  & నూతన  మోహన్ 

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...