Thursday, April 16, 2020

Emo Emo Emo Nannu Thake Haye Premo song lyrics - Raahu

ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ     నీ తోటి  నే  సాగగా 
పాదాలు  దూరాలు  మరిచాయి  ఒట్టు     మేఘాల్లో  వున్నట్టుగా 
ఇక  గుండెల్లో  ఓ  గుట్టు  దాగేటు  లేదు    నీ  చూపు  ఆకట్టగా 
నాలోకి  జారింది  ఓ  తేనే  బొట్టు     నమ్మేటుగా  లేదుగా  ప్రేమే 

ఏమో  ఏమో  ఏమో  నన్ను  తాకే  హాయే  ప్రేమో 

ఏమో  ఏమో  ఏమో  చెప్పలేని  మాయే  ప్రేమో(2) 


నేనేనా  ఈ  వేళ  నేనేనా 

నాలోకి  కళ్లారా  చూస్తున్నా 
ఉండుండి  ఏ  మాటో  అన్నానని  
సందేహం  నువ్వేదో  విన్నావని 
వినట్టు  వున్నావా  బాగుందని   తేలే  దారెందని 

ఏమో  ఏమో  ఏమో  నన్ను  తాకే  హాయే  ప్రేమో 

ఏమో  ఏమో  ఏమో  చెప్పలేని  మాయే  ప్రేమో  (2)


ఏమైనా  బాగుంది  ఏమైనా 

నా  ప్రాణం  చేరింది  నీలోనా 
ఈ  చోటే  కాలాన్ని  ఆపాలని  
నీ  తోటి  సమయాన్ని  గడపాలని  
నా  జన్మే  కోరింది  నీ  తోడుని  గుండె  నీదేనని 

ఏమో  ఏమో  ఏమో  నన్ను  తాకే  హాయే  ప్రేమో 

ఏమో  ఏమో  ఏమో  చెప్పలేని  మాయే  ప్రేమో (2)


సంగీతం    : ప్రవీణ్  లక్కరాజు 

సాహిత్యం  : శ్రీనివాస  మౌళి 
గానం         :  సిద్ శ్రీరామ్ 

గమనిక : ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

Oorellipota Mama Song lyrics - ChowRaasta team

ఊరెల్లిపోతా మామా ఊరెల్లిపోతా మామా
ఎర్ర బస్సెక్కి మళ్ళీ తీరిగెలిపోతా మామ (2)

ఏవూరెళ్తావ్ రామ ఏముందనేలతావ్  రామ
ఊరన్న పేరే తప్పా  తీరంతా మారే రామ(2) 


నల్లమల అడవుల్లోనా  పులిసింతా సెట్లకింద
మల్లెలూ పూసేటి  సల్లనీ పల్లె ఒకటుంది
మనసున్నా పల్లె జనం  మోసం తెలియని తనం
అడవి ఆ పల్లె అందం పువ్వు తేనెల సందం

నల్లమల అడవుల్లోనా  పులిసింతా సెట్ల కిందా
పుత్తడీ గనుల కోసం సిత్తడీ బావులు తవ్వే
పుత్తడీ మెరుపుల్లోనా మల్లెలు మాడిపోయే
మనసున్నా పల్లె జనం వలసల్లో సెదిరిపోయే

ఏవూరెళ్తావ్ రామ  ఏముందానేలతావ్ రామ
ఊరన్న పేరే తప్పా  తీరంతా మారే రామ (2)


గోదారీ లంకల్లోనా  అరిటాకు నీడల్లోనా
ఇసుక తిన్నేళ్లు మీద  వెండి వెన్నెల్లు కురువా
గంగమ్మ గుండెల్లోనా  వెచ్చంగా దాచుకున్నా
సిరిలేన్నో పొంగిపొర్లే  పచ్చనీ పల్లెఒకటుంది

ఏ… గోదారీ గుండెల్లోనా  అరిటాకు నీడల్లోనా
ఇసుకంతా తరలిపోయే  ఎన్నెల్లు రాలిపాయే
ఎగువ గోదారీ పైన  ఆనకట్టలు వెలిసే
ఆ పైనా పల్లెలన్ని  నిలువునా మునిగిపోయే

ఏవూరెళ్తావ్ రామ  ఏముందానేలతావ్ రామ
ఊరన్న పేరే తప్పా  తీరంతా మారే రామ


సాహిత్యం : ఆనంద్ గుర్రం  మరియు రామ్  మిరియాల 
సంగీతం   : రామ్  మిరియాల 
గానం        : రామ్  మిరియాల 

గమనిక : ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.



Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...