Monday, March 9, 2020

Neeli neeli aakasham song lyrics - 30 Rojullo preminchatam ela

నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తు ఉన్నా

నెలవంకను ఇద్దాం అనుకున్నా

ఓ..... నీ నవ్వుకు సరిపోదంటున్నా
నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తు ఉన్నా


ఓ.... వాన విల్లులో ఉండని రంగు నువ్వులే

యే రంగుల చీరను నీకు నెయ్యాలే 
నల్ల మంబుల మెరిసే కళ్లు నీవిలే
ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే  తనువంతా చుక్కను పెట్టాలే
ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా

నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా

నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా


ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే

ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వెలితో నడిపే ధైర్యమే  నీది 
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వరమోసిగే దేవుడికే నేనేమ్ తిరిగి ఇవ్వాలే
ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటు అలిసాను పూర్తిగా
కనుకే మళ్లీ మళ్లీ జన్మెత్తి నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తు ఉన్నా




చిత్రం     : ౩౦ రోజుల్లో ప్రేమించటం ఎలా 

రచన      : చంద్ర బోస్ 
గానం      : సిద్ శ్రీరామ్ , సునీత 
సంగీతం : అనూప్ రూబెన్స్ 

గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె  కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

No comments:

Post a Comment

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...